11వ సారి గిన్నిస్ రికార్డు సాధించిన ‘గీతం’ విద్యార్థిని
- బీటెక్ నాలుగో ఏడాది చదువుతున్న శివాలి
- ఆరెగామి పత్రంతో 9,200 చేపల నమూనాలు
- రికార్డు పత్రాన్ని ఆన్‌లైన్ ద్వారా పంపిన గిన్నిస్ కార్యాలయం
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారం గీతం డీమ్డ్ యూనివర్సిటీ బీటెక్ విద్యార్థిని శివాలి జోహ్రి శ్రీవాస్తవ మరోమారు గిన్నిస్ రికార్డు సాధించింది. బీటెక్ నాలుగో ఏడాది చదువుతున్న శివాలి ఆరెగామి పత్రంతో 9,200 చేపల నమూనాలను తయారుచేసింది.
ఈ విషయంలో ఆమె తల్లిదండ్రులు కవిత, అనితల సాయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను గీతం అధికారులు గిన్నిస్ బుక్ కేంద్ర కార్యాలయానికి పంపారు. వారు వాటిని పరిశీలించి గిన్నిస్ రికార్డు సాధించినట్టు పేర్కొంటూ ఆన్‌లైన్ ద్వారా గిన్నిస్ రికార్డు పత్రాన్ని పంపారు. కాగా, శివాలి ఇప్పటికే వివిధ అంశాల్లో పది గిన్నిస్ బుక్ రికార్డులు సాధించింది.