తెలుగు సినీ చరిత్రలో ఎవరికీ అందని రికార్డు... 'అల వైకుంఠపురములో'కు 100 కోట్ల వ్యూస్!

  • యూట్యూబ్ లో మ్యూజిక్ ఆల్బమ్ కు బిలియన్ వ్యూస్
  • వెల్లడించిన గీతా ఆర్ట్స్
  • సినిమాకు రికార్డు మీద రికార్డు
అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచిన 'అల వైకుంఠపురములో' ఇప్పుడు మరో సూపర్ రికార్డును సొంతం చేసుకుంది. తెలుగు సినీ చరిత్రలో ఇంతవరకూ మరెవరికీ దక్కని వన్ బిలియన్ వ్యూస్ రికార్డును సాధించింది.

యూ ట్యూబ్ లో సినిమా మ్యూజిక్ ఆల్బమ్ కు 100 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఈ విషయాన్ని ఓ ట్వీట్ ద్వారా తెలియజేసిన గీతా ఆర్ట్స్, "మా ఆల్బమ్‌ను ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు" అని పేర్కొంది. ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకత్వం వహించగా, ప్రతి పాటా హిట్ అయింది.  సినిమా విడుదలై నాలుగు నెలలు అయినా, రికార్డు మీద రికార్డును సొంతం చేసుకుంటూనే ఉండటం విశేషం.


More Telugu News