మరోసారి భారీ సంఖ్యలో కొత్త కేసులు... తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి
- ఇవాళ కొత్తగా 55 కేసులు
- జీహెచ్ఎంఎసీ పరిధిలో 44 మందికి కరోనా పాజిటివ్
- నేడు 12 మంది డిశ్చార్జి
తెలంగాణలో ఇవాళ కొత్తగా మరో 55 కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1509కి పెరిగింది. ఇవాళ 12 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు 971 మంది కోలుకున్నట్టయింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 504 మంది చికిత్స పొందుతున్నారు.
కాగా, ఇవాళ నమోదైన కొత్త కేసుల్లో 44 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో గుర్తించారు. సంగారెడ్డి జిల్లాలో 2, రంగారెడ్డి జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. ఇక 8 మంది వలస కార్మికులకు కరోనా సోకినట్టు తేలింది. ఇప్పటివరకు కరోనా బారినపడిన వలస కార్మికుల సంఖ్య 52కి చేరింది. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ చోటుచేసుకోలేదు. ఇప్పటివరకు తెలంగాణలో 34 మంది కరోనాతో కన్నుమూశారు.