డాక్టర్ చేతులు విరిచి కట్టి, కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది?: సీపీఐ రామకృష్ణ
- పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు
- దాడిపై సమగ్ర విచారణ జరిపించాలి
- ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారికి ఇలాంటి ఫలితమే ఉంటుందా?
డాక్టర్ సుధాకర్ పై విశాఖ పోలీసులు అమానుషంగా ప్రవర్తించడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఖండించారు. ఇది చాలా అమానుషమని మండిపడ్డారు. డాక్టర్ పై జరిగిన దాడిపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
చేతులు వెనక్కి విరిచి కట్టి, కొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసే పనులను ప్రశ్నించిన వారందరికీ... ఇలాంటి ఫలితమే ఉంటుందా? అని మండిపడ్డారు. మరోవైపు డాక్టర్ పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ నేతలు కూడా ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.