తెలంగాణలో మాంసం దుకాణదారులకు కొత్త రూల్స్.. పాటించకపోతే కఠిన చర్యలు!
- చెత్త బుట్టలకు రంధ్రాలు ఉండరాదు
- కత్తులను వేడి నీటితో కడగాలి
- దుకాణాల్లో పని చేసే వారికి చర్మ వ్యాధులు ఉండరాదు
తెలంగాణలో కంటైన్మెంట్ ఏరియాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో షాపులు నెమ్మదిగా తెరుచుకుంటున్నాయి. నాన్ వెజ్ షాపులను కూడా అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో, నాన్ వెజ్ అమ్మే దుకాణదారులకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. నిబంధనలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఇక ప్రభుత్వం విధించిన నిబంధనలు ఏమిటంటే...
- అన్ని దుకాణాల్లో చెత్త బుట్టలు ఉండాలి.
- చెత్త వేసే బిన్ లకు రంధ్రాలు ఉండరాదు.
- మాంసాన్ని కోసే కత్తులను వేడి నీటితో కడగాలి.
- షాపుల్లో పని చేసే వారు ఆప్రాన్, గ్లౌజులు, హెడ్ గేర్ ధరించాలి.
- దుకాణాల్లో పని చేసే వారికి చర్మ వ్యాధులు ఉండరాదు.
- గోర్లు పెంచుకోరాదు.
- దుకాణాలను ఎప్పటికప్పుడు బ్లీచింగ్ తో శుభ్రపరచాలి.
- మాంసం మీద ఈగలు వాలకుండా చూసుకోవాలి.
- వ్యర్థాలను బయట పడేయరాదు. టన్ను కంటే తక్కువ ఉంటే భూమిలో పూడ్చిపెట్టాలి. అంతకంటే ఎక్కువ ఉంటే బయో మేథనేషన్ ద్వారా నిర్మూలించాలి.