మాస్క్ లేకపోతే... ఆ దేశంలో జైలు శిక్షతో పాటు భారీ వడ్డన!

  • ఖతార్ జనాభా 27 లక్షలు
  • నమోదైన కరోనా కేసులు 28 వేలు
  • 14 మంది మృతి
కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు అన్ని దేశాలు పలు చర్యలను చేపడుతున్నాయి. గల్ఫ్ దేశం ఖతార్ ఈ విషయంలో మరింత కట్టుదిట్టంగా వ్యవహరిస్తోంది. సామాజిక దూరాన్ని పాటించడం, ముఖాలకు మాస్కులను ధరించడం తప్పనిసరి చేసింది. ఒక వేళ ముఖానికి మాస్క్ ధరించకుండా బయటకు వస్తే 2 లక్షల రియాల్స్ ( ఇంచుమించు రూ. 42 లక్షల) జరిమానాతో పాటు, మూడేళ్లు జైలుకు కూడా పంపనుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి తీవ్ర హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఖతార్ జనాభా 27 లక్షలు. వీరిలో 28 వేల మంది కరోనా బారిన పడ్డారు. అయితే కేవలం 14 మంది మాత్రమే ప్రాణాలు కోల్పోవడం ఆ దేశానికి ఊరటనిచ్చే అంశం. ఖతార్ లో నిర్మాణ రంగ పనులు మాత్రమే జరుగుతున్నాయి. మసీదులు, రెస్టారెంట్స్, సినిమా హాళ్లు, బార్స్ అన్నీ మూతపడ్డాయి.


More Telugu News