ఇది ముమ్మాటికీ మాటల ప్రభుత్వమే: ఉత్తమ్ కుమార్
- పండిన వరిలో ప్రతి గింజ కొంటామని మాట తప్పారన్న ఉత్తమ్
- 1 కోటి 5 లక్షల టన్నుల వరి పండిందని వెల్లడి
- 44 లక్షల టన్నులే కొన్నారని విమర్శలు
రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత తమదేనని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పిందని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా పండిన 1 కోటి 5 లక్షల టన్నుల వరిలో ప్రతి గింజ కొంటామని తెలంగాణ సీఎంవో మాట ఇచ్చి నేటికి 45 రోజులైందని, కానీ ఇప్పటివరకు కొన్నది 44 లక్షల టన్నులేనని విమర్శించారు. రాష్ట్రంలో వరి రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇది ముమ్మాటికీ మాటల ప్రభుత్వమేనని వ్యాఖ్యానించారు. ఈ రోజు వెలుగు పేపర్ లో మొదటి పేజీ చూడండి అంటూ మీడియా కథనాన్ని కూడా పోస్టు చేశారు.