నడవలేక చిన్నారుల కష్టాలు.. కన్నీరు పెట్టిస్తున్న దృశ్యాలు

  • లాక్‌డౌన్‌ నేపథ్యంలో సొంత గ్రామాలకు వెళ్లేందుకు కష్టాలు 
  • రాష్ట్రాలు దాటి చిన్నారులతో తల్లిదండ్రుల ప్రయాణం
  • అలసిపోతోన్న చిన్నారులు
  • వారిని తీసుకెళ్లేందుకు తల్లిదండ్రుల కష్టాలు
లాక్‌డౌన్‌ నేపథ్యంలో సొంత గ్రామాలకు వెళ్లేందుకు కూలీలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. పిల్లలతో కలిసి వేలాది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తూ వారు పడుతున్న బాధలు చూసి పోలీసులు కూడా చలించి పోతున్నారు. కడప నుంచి ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లేందుకు తమ పసి పిల్లలను ఓ కుటుంబం డోలిలో కూర్చోబెట్టుకుని తీసుకెళ్లింది. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు వారికి సాయం చేశారు.

వారి కష్టాలు చూసి చలించి పోయిన యెమ్మింగనర్ టౌన్ హెడ్ కానిస్టేబుల్ జగదీశ్‌ కుమార్ వారికి ఓ వాహనం ఏర్పాటు చేసి పంపారని ఏపీ పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో తెలిపారు.

                            
కాగా, మరో ఘటనలో నడిచీనడిచి అలసిపోయిన తన కుమారుడిని ఓ తల్లి వీల్ సూట్‌కేసుపై పడుకోబెట్టి తోసుకుంటూ ముందుకు కదులుతూ కొన్ని కిలోమీటర్లు నడిచింది. వారు పంజాబ్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు వెళ్తున్నారు.


More Telugu News