ఇప్పటికైనా వీటిపై స్పందించండి.. ముఖ్యమంత్రి జగన్ గారూ!: దేవినేని ఉమ

  • సొంతూరు చేరాలని వలస కార్మికులు కష్టాలు పడుతున్నారు
  • "నరకయాత్ర"పై ఉన్నత న్యాయస్థానం స్పందించి ఆదేశాలిచ్చింది
  • వేలకోట్లు అప్పులుచేస్తూ జీవో98ను ఎలా విడుదల చేస్తారు?
  • తక్షణమే జీవోను రద్దు చేయాలి
కరోనా విపత్కర సమయంలో వలస కార్మికుల కష్టాలు, విశాఖ, గుంటూరులో ప్రభుత్వ భూముల వేలంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావుపై మండిపడ్డారు. 'సొంతూరు చేరాలని 53 రోజులుగా వలస కార్మికులు దాతలుపెడితే తింటూ పంపునీరు తాగుతూ చెప్పులరిగిపోయేలా సాగిస్తున్న "నరకయాత్ర"పై ఉన్నత న్యాయస్థానం స్పందించి ఆదేశాలిచ్చింది. అన్నా క్యాంటీన్ లు ఉంటే నేడు ఈ పరిస్థితి ఉండేదికాదు కదా ఇప్పటికైనా స్పందించండి రాజప్రసాదంలోని ముఖ్యమంత్రి జగన్ గారు' అని దేవినేని ఉమ ట్వీట్ చేశారు.

'కరోనా కష్ట సమయంలో  విశాఖ, గుంటూరులో వందలకోట్ల విలువైన ప్రభుత్వ భూములు వేలానికి పెట్టింది. జగన్ అన్న జయహో జైత్రయాత్ర నాటకాల కోసం ఒకవైపు వేలకోట్లు అప్పులుచేస్తూ మీకు భజన చేయడం కోసం జీవో98ను ఎలా విడుదల చేస్తారు? తక్షణమే జీవోను రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు జగన్ గారూ' అని దేవినేని ఉమ పేర్కొన్నారు.


More Telugu News