ప్రధానోపాధ్యాయుడి ఉసురు తీసిన షేర్ మార్కెట్ నష్టాలు
- నల్గొండ జిల్లాలో ఘటన
- షేర్ మార్కెట్లో నష్టాలు, ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం
- తనను క్షమించాలంటూ సూసైడ్ నోట్
షేర్ మార్కెట్లో నష్టాలు ఓ ప్రధానోపాధ్యాయుడి ఉసురు తీశాయి. నల్గొండలోని హిమగిరికాలనీకి చెందిన మల్ల శ్రీనివాస్‌రెడ్డి (45) గుర్రంపోడ్ మండలం మైలపురం ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన ఆయన అందులో నష్టాలు రావడంతో తట్టుకోలేకపోయాడు. దీనికితోడు ఆర్థిక ఇబ్బందులు కూడా ఆయనను వేధించాయి. దీంతో జీవితంపై విరక్తి పెంచుకున్న ఆయన నిన్న ఉదయం స్కూటీపై తిప్పర్తి మండలంలోని రాయినిగూడేనికి చేరుకున్నాడు.
గ్రామ శివారులోని ఓ రైసుమిల్లు వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. షేర్ మార్కెట్ నష్టాలే తన ఆత్మహత్యకు కారణమని, తనను క్షమించాలని రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు భార్య సునీత, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.