ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. త్వరలో తెరుచుకోనున్న ఆలయాలు
- భక్తుల మధ్య భౌతిక దూరం తప్పనిసరి
- దర్శనానికి ఆన్‌లైన్‌లో టైం స్లాట్ బుక్ చేసుకోవాలి
- ఆలయ పరిసరాలు హైపోక్లోరైడ్ ద్రావణంతో ఎప్పటికప్పుడు స్ప్రే
లాక్‌డౌన్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో మూతపడిన ఆలయాలను తిరిగి తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయశాఖ అన్ని ఆలయాల ఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. ఆలయాలు తెరిచిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆలయానికి వచ్చే భక్తులు విధిగా కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను పాటించాలని, భౌతిక దూరం తప్పనిసరని పేర్కొంది.
దర్శనానికి సంబంధించిన టైం స్లాట్‌ను ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవాలని భక్తులకు సూచించింది. ఆలయాల్లో డిస్ ఇన్‌ఫెక్షన్ టన్నెల్ ఏర్పాటు చేయడంతోపాటు శానిటైజేషన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. అలాగే, ఆలయ పరిసరాలను, క్యూలను ఎప్పటికప్పుడు హైపోక్లోరైడ్ ద్రావణంతో స్ప్రే చేయాలని ఈవోలకు పంపిన ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఆలయాలు ఎప్పటి నుంచి తెరవాలన్న విషయాన్ని మాత్రం అందులో పేర్కొనలేదు.