రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన ఏపీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులకు బ్రేక్!

  • సాంకేతిక కారణాలతో తాత్కాలికంగా బ్రేక్
  • ఎప్పటి నుంచి నడుపుతారో రేపు క్లారిటీ వచ్చే అవకాశం
  • తొలి విడతలో 13 వేల మందికి అనుమతి ఇచ్చిన ఆర్టీసీ
హైదరాబాద్ నుంచి ఏపీ ప్రజలను సొంత రాష్ట్రానికి తరలించేందుకు ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ రవాణా తాత్కాలికంగా వాయిదా పడింది. సర్వీసులను ఎప్పటి నుంచి నడుపుతారనే విషయంపై ఆర్టీసీ అధికారులు క్లారిటీ ఇవ్వనున్నారు.

లాక్ డౌన్ కారణంగా ఏపీ ప్రజలు హైదరాబాదులోనే ఉండిపోయారు. అత్యవసర పనులు ఉన్నప్పటికీ వెళ్లలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలను తరలించేందుకు ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఆన్ లైన్ ద్వారా టికెట్లను జారీ చేసింది. భాగ్యనగరం నుంచి ఏపీలోని వివిధ జిల్లాలకు వెళ్లేందుకు తొలుత 13 వేల మందికి అనుమతి ఇచ్చారు. అయితే, సాంకేతిక కారణాలతో బస్సు ప్రయాణాలకు బ్రేక్ పడింది. దీంతో స్వస్థలాలకు వెళ్లాలనుకున్న వారి ఆశ ఆవిరైపోయింది. సర్వీసులను ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయంపై రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


More Telugu News