ఈ ఐడియాతో థియేటర్ల ఆదాయం పెరగొచ్చేమో!: నాగ్ అశ్విన్

  • విదేశాల్లో సినీ థియేటర్లలోనూ మద్యం అమ్మకాలు
  • మన దగ్గరా ఇదే విధానం తీసుకువస్తే ఎలావుంటుందన్న అశ్విన్
  • ఇది మంచి ఆలోచనో, చెడు ఆలోచనో చెప్పాలంటూ ట్వీట్
మహానటి చిత్రంతో పేరు తెచ్చుకున్న యువ దర్శకుడు నాగ్ అశ్విన్ ఆసక్తికరమైన ప్రతిపాదన చేశాడు. థియేటర్లలో మద్యం అమ్మకాలతో ఆదాయం పెరిగే అవకాశముందని అభిప్రాయపడ్డాడు. దీనిపై ట్విట్టర్ లో స్పందించాడు. "ఓసారి నిర్మాత సురేశ్ బాబు, రానాతో చర్చ సందర్భంగా విదేశాల్లో మాదిరే మన థియేటర్లలో కూడా బీరు, బ్రీజర్, వైన్ సప్లై చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. ఈ విధానంతో థియేటర్లు ఫుల్ అవ్వొచ్చేమో కదా అనిపించింది. ఆదాయం కూడా బాగానే వస్తుందనిపించింది" అని వెల్లడించాడు.

అయితే తనే మళ్లీ ఓ ట్వీట్ లో, ఈ విధానం థియేటర్లలో ఫ్యామిలీ ఆడియెన్స్ ను తగ్గిస్తుందని పేర్కొన్నాడు. ఇదే సమస్యకు పరిష్కారం అన్నట్టుగా కాకుండా కొన్ని మల్టీప్లెక్స్ ల్లో ఇదొక ఆప్షన్ లాగానే పరిగణించాలని సూచించాడు. ఇది మంచి ఆలోచన అంటారా? చెడు ఆలోచన అంటారా? అంటూ నెటిజన్లను ప్రశ్నించారు.


More Telugu News