భారత్ లో ‘ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్’... పదిహేను వేల పందుల మృతి!

  • చైనా నుంచి వ్యాప్తి చెందిన వైరస్ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ 
  • జంతువుల నుండి జంతువులకే సంక్రమిస్తుంది
  • అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లలో ఈ వైరస్ గుర్తింపు
జంతువుల నుండి జంతువులకే సంక్రమించే వైరస్ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్. భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లలో ఈ వైరస్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అస్సాంలో ‘ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్’ బారినపడ్డ పందులు దాదాపు 15 వేల వరకు మృతి చెందాయి. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ పది జిల్లాలకు వ్యాపించడంతో  దాని బారిన పడి మృతి చెందుతున్న పందుల సంఖ్య పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం సుమారు పది జిల్లాల్లో హై అలర్ట్ జారీ చేసింది. వైరస్ సోకిన పందులను సామూహికంగా చంపాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశామని అసోం పశు సంవర్థక శాఖ మంత్రి అతుల్ బోరా చెప్పారు. ఈ వైరస్ చైనా నుంచి వ్యాప్తి చెందిందని, దీంతో  దేశీయ పందులకు ప్రాణాంతకమని, దాదాపు వంద శాతం మరణాల రేటు ఉంటుందని అన్నారు.


More Telugu News