జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు మరింత పొడిగింపు
- మే 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్న ఎన్టీఏ
- ఇప్పటికే ఓసారి గడువు పెంపు
- ఇప్పటికీ ఖరారు కాని పరీక్షల తేదీలు
- పరిస్థితులను బట్టి నిర్ణయం ఉంటుందన్న ఎన్టీఏ
కరోనా మహమ్మారి ప్రభావంతో అనేక జాతీయ స్థాయి పరీక్షలకు ఇప్పటికీ మోక్షం కలగలేదు. ఆయా ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును కూడా ఇప్పటికే ఓసారి పెంచారు. ఇప్పటికీ లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా మరో రెండు వారాలు పెంచుతున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐకార్)-2020, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష (జేఎన్ యూఈఈ)-2020, యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (యూజీసీ నెట్)-2020, జాయింట్ సీఎస్ఐఆర్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీఎస్ఐఆర్-నెట్)-2020 ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే గడువును మే 31 వరకు పెంచారు. ఇక ఆయా ప్రవేశ పరీక్షల తేదీలను కరోనా లాక్ డౌన్ పరిస్థితులను పరిశీలించిన పిదప, ఆయా సంస్థల వెబ్ సైట్ల ద్వారా వెల్లడిస్తారని ఎన్టీఏ పేర్కొంది.