కుప్పకూలి... కోలుకున్న స్టాక్ మార్కెట్లు
- ఇన్వెస్టర్లను ఆకట్టుకోని కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీ
- తీవ్రంగా ప్రభావితమవుతున్న బ్యాంకింగ్ స్టాకులు
- 25 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్
దేశీయి స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ ఆకట్టుకోకపోవడంతో సూచీలు ఒడిదుడుకులకు గురయ్యాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాకులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
ఒకానొక సమయంలో సెన్సెక్స్ 400 పాయింట్ల వరకు నష్టపోయింది. ఆ తర్వాత మెటల్స్ అండతో నెమ్మదిగా కోలుకుంటూ స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 25 పాయింట్లు నష్టపోయి 31,097కు పడిపోయింది. నిఫ్టీ 5 పాయింట్లు కోల్పోయి 9,136 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (2.68%), ఏసియన్ పెయింట్స్ (2.08%), టాటా స్టీల్ (1.81%), ఎన్టీపీసీ (1.73%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.63%).
టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-4.70%), యాక్సిస్ బ్యాంక్ (-3.30%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.24%), హీరో మోటో కార్ప్ (-2.06%), సన్ ఫార్మా (-1.63%).