జూలై నాటికి 4 రాఫెల్ యుద్ధవిమానాలు భారత్ రాక

  • 36 రాఫెల్ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్ తో ఒప్పందం
  • మే చివరినాటికి రావాల్సిన విమానాలు
  • కరోనా నేపథ్యంలో షెడ్యూల్ సవరణ
గగనతల పోరాట సామర్థ్యాన్ని మరింత ఇనుమడింపజేసే బ్రహ్మాస్త్రాలుగా పేరుగాంచిన రాఫెల్ యుద్ధవిమానాలు జూలై చివరి నాటికి భారత్ రానున్నాయి. వీటిలో 3 రెండు సీట్ల ట్రైనర్ విమానాలు కాగా, మరొకటి సింగిల్ సీటర్ పోరాట విమానం. ఫ్రాన్స్ తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఈ విమానాలు మే చివరినాటికి భారత్ చేరుకోవాల్సి ఉన్నా, కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో రెండు నెలలు వాయిదాపడింది. జూలై చివరి నాటికి ఈ నాలుగు విమానాలు అంబాలా ఎయిర్ బేస్ చేరుకుంటాయని భారత రక్షణ రంగ వర్గాలు వెల్లడించారు. ఈ విమానాలు ఫ్రాన్స్ నుంచి నేరుగా భారత్ వస్తాయని, కేవలం 10 గంటల్లోనే ఇవి అంబాలా ఎయిర్ బేస్ చేరుకుంటాయని తెలుస్తోంది. మొత్తం 36 రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలుకు ఫ్రాన్స్ తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.


More Telugu News