ఒంగోలులోని మినో ఫామ్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం.. భయంతో కార్మికుల పరుగులు

  • పేర్నమిట్ట సమీపంలో ఘటన
  • కార్మికులు శానిటైజర్లు తయారు చేస్తుండగా ప్రమాదం
  • రెండో అంతస్తులో దట్టమైన పొగలు
లాక్‌డౌన్ సడలింపులతో తెరుచుకుంటున్న పరిశ్రమల్లో గ్యాస్ లీక్ ఘటనలు, అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుండడం కలకలం రేపుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో భారీ ప్రమాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ రోజు ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో మరో పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ రోజు ఉదయం పేర్నమిట్ట సమీపంలోని మినో ఫామ్ ఔషధ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అందులో కార్మికులు శానిటైజర్లు తయారు చేస్తుండగా అందులో వినియోగించే ఆల్కహాల్‌ కారణంగా ప్రమాదం సంభవించిందని సమాచారం. ఆ పరిశ్రమలోని రెండో అంతస్తులో దట్టమైన పొగలు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఆ పరిశ్రమ నుంచి కార్మికులు భయంతో బయటకు పరుగులు తీస్తూ కనపడ్డారు.


More Telugu News