ఖుష్బూ ఓ బ్రోకర్ అంటూ గాయత్రీ రఘురామ్ తీవ్ర వ్యాఖ్యలు!

  • మోదీ తమిళంలో ఎందుకు మాట్లాడటం లేదన్న ఖుష్బూ
  • ఇప్పటికే నెటిజన్ల నుంచి విమర్శలు
  • తాజాగా గాయత్రీ రఘురామ్ నుంచి విమర్శలు
బీజేపీ నేత, నటి, నృత్య దర్శకురాలు గాయత్రీ రఘురామ్, ఖుష్బూ ఓ బ్రోకర్ అంటూ తీవ్ర విమర్శలకు దిగారు. ఇటీవల జాతిని ఉద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగం, వీరి మధ్య విమర్శల వెల్లువకు కారణమైంది. మోదీ హిందీలో మాట్లాడగా, ఇండియాలో ప్రాచీన భాష అయిన తమిళంలో ఆయన ఎందుకు మాట్లాడలేదని ఖుష్బూ వ్యాఖ్యానించడం జరిగింది.

ఖుష్బూ వ్యాఖ్యలను ఇప్పటికే నెటిజన్లు ఖండిస్తుండగా, తాజాగా గాయత్రీ రఘురామ్ కూడా తోడయ్యారు. ప్రధాని స్థాయిలోని వ్యక్తిని అవహేళన చేస్తూ మాట్లాడటాన్ని ఖండిస్తున్నానన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెట్టారు.


More Telugu News