నాగాయలంకలో కానిస్టేబుల్ భార్య అనుమానాస్పద మృతి
- భర్త ఇంట్లో లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య
- ఎనిమిదేళ్ల క్రితం వివాహం
- అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
కృష్ణా జిల్లా నాగాయలంకలో ఓ కానిస్టేబుల్ భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. గొరిపర్తి జగ్గయ్య స్థానిక పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. 8 ఏళ్ల క్రితం చల్లపల్లి మండలం మంగళాపురానికి చెందిన సుధారాణి (33)తో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిన్న మధ్యాహ్నం భర్త ఇంట్లో లేని సమయంలో సుధారాణి ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.