ఉపశమనం ఎప్పుడో అంతుబట్టడం లేదు: విజయశాంతి

  • ప్రభుత్వ మాటలు విని రెండు నెలలుగా ఇళ్లలోనే ప్రజలు
  • ఆది నుంచి అయోమయ ప్రకటనలే
  • వివాదాస్పద వైఖరి అవలంబిస్తున్న టీఆర్ఎస్
  • ట్విట్టర్ లో ఆరోపించిన విజయశాంతి
కరోనా కేసులు తగ్గుతాయని ప్రభుత్వం చెప్పిన మాటలను నమ్మిన ప్రజలు, రెండు నెలలు ఇళ్లకే పరిమితం అయ్యారని, వారికి ఉపశమనం ఎప్పుడో అంతుబట్టడం లేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌ పర్సన్ విజయశాంతి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు చేశారు.

 "టిఆర్ఎస్ సర్కారు సూచనలతో దాదాపు 2 నెలలుగా ఇళ్లకే పరిమితమైన గ్రేటర్ హైదరాబాద్ వాసులకు కరోనా మహమ్మారి నుంచి ఉపశమనం ఎప్పుడో  అంతుబట్టడం లేదు. మే 8వ తేదీ తర్వాత తెలంగాణలో కరోనా కేసులు పూర్తిగా తగ్గుతాయన్న ప్రభుత్వ ప్రకటనలు చూసి హైదరాబాద్ వాసులు చాలా ఆశలు పెంచుకున్నారు.

కానీ...మొదటి నుంచీ అయోమయ ప్రకటనలతో,  అస్పష్ట నిర్ణయాలతో... కరోనా కట్టడి విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వివాదాలకు తావిస్తోంది. ఇప్పటికైనా ఈ వైఖరిలో మార్పు రావాలని తెలంగాణ సమాజం కోరుకుంటోంది అని వ్యాఖ్యానించారు.


More Telugu News