పదో తరగతి పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వండి.. హైకోర్టును కోరిన తెలంగాణ ప్రభుత్వం
- లాక్ డౌన్ తో నిలిచిన పదో తరగతి పరీక్షలు
- హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సర్కారు
- అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరనున్న విద్యాశాఖ
తెలంగాణలో లాక్ డౌన్ అమల్లో ఉండడం వల్ల పదో తరగతి పరీక్షల నిర్వహణ సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు జరిపేందుకు అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వం హైకోర్టును కోరింది. ఈ మేరకు ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా పరీక్షలకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. వైద్యుల సూచన మేరకు కరోనా నియంత్రణ ఏర్పాట్లు చేశామని అఫిడవిట్ లో వెల్లడించింది. కాగా, తమ అభ్యర్థనపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని తెలంగాణ విద్యాశాఖ హైకోర్టును కోరాలని భావిస్తోంది. తెలంగాణలో ఇప్పటికే పదో తరగతి పబ్లిక్ కు సంబంధించి మూడు పరీక్షలు నిర్వహించారు. అయితే కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం మిగతా పరీక్షల నిర్వహణ వాయిదా వేసింది.