నీరవ్ మోదీని కాపాడేందుకు కాంగ్రెస్ యత్నిస్తోంది: రవిశంకర్ ప్రసాద్
- కాంగ్రెస్ నేత థిప్సే లండన్ కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు
- అక్కడి న్యాయ వ్యవస్థను ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారు
- థిప్సే 2018లో కాంగ్రెస్ లో చేరారు
కాంగ్రెస్ పార్టీపై కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తీవ్ర ఆరోపణలు చేశారు. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలను కాపాడేందుకు ఆ పార్టీ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉందని అన్నారు. కాంగ్రెస్ నేత, ముంబై హైకోర్టు మాజీ జడ్జి అభయ్ థిప్సే లండన్ కోర్టులో నీరవ్ మోదీని కాపాడేందుకు అక్కడి న్యాయ వ్యవస్థను ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్ నుంచి ఆయనను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఈరోజు నిర్వహించిన వీడియో ప్రెస్ కాన్ఫరెన్స్ లో రవిశంకర్ ప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశారు.
నీరవ్ మోదీని ఇండియాకు రప్పించేందుకు భారత ప్రభుత్వం యత్నిస్తోందని... ఇదే సమయంలో ఆయనను రక్షించేందుకు థిప్సే యత్నిస్తున్నారని చెప్పారు. లండన్ కోర్టులో థిప్సే వాదనలు వినిపిస్తూ మోదీ నిర్దోషి అని, ఆయనపై ఎలాంటి కేసులు లేవని వాదించారని విమర్శించారు.
2018 జూన్ 13న కాంగ్రెస్ పార్టీలో థిప్సే చేరారని చెప్పారు. రాహుల్ గాంధీ, అశోక్ గెహ్లాట్ వంటి నేతల సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారని తెలిపారు.