వాలంటీర్లది కూడా నటన అంటారా?: విశాఖ గ్యాస్ లీక్ బాధితుల ఆగ్రహం
- విష వాయువులు పీల్చిన వారికి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు
- అందరికీ హెల్త్ కార్డులు అందించాలి
- మంత్రులు ఒక రాత్రి నిద్ర చేస్తే సరిపోదు
విష వాయువులు పీల్చి అస్వస్థతకు గురై పడిపోతే నటన అంటారా? అంటూ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితులు, వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విష వాయువులు లీక్ అయిన గ్రామాల్లోని గ్రామ వాలంటీర్లు కూడా అస్వస్థతకు గురై పడిపోయారని... వారిది కూడా నటనే అంటారా? అని ప్రశ్నించారు.
విష వాయువులు పీల్చిన వారికి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారని... గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో ఉన్న అందరికీ వైద్య పరీక్షలను నిర్వహించాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా... భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా చికిత్స అందించాలని కోరారు. గ్యాస్ లీకైన గ్రామాల్లో మంత్రులు ఒక రాత్రి నిద్ర చేసినంత మాత్రాన సరిపోదని అన్నారు.
మరోవైపు గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. వందల మంది కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. కోలుకున్న కొందరు బాధితులను ఈరోజు ఆసుపత్రి నుంచి విడుదల చేసే అవకాశం ఉంది.