కరోనాకు సంప్రదాయ ఔషధాలు.. వారం రోజుల్లో ప్రారంభం కానున్న ట్రయల్స్!
- నాలుగు ఔషధాలను ప్రయోగించేందుకు రంగం సిద్ధం
- ఆయుష్, సీఎస్ఐఆర్ ల సంయుక్త కార్యాచరణ
- మన ఔషధాలు పని చేస్తాయన్న కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్
కరోనా వైరస్ కు చికిత్స అందించే క్రమంలో నాలుగు సంప్రదాయ ఔషధాలను పరీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన ట్రయల్స్ త్వరలోనే ప్రారంభమవుతాయని ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ తెలిపారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసర్చ్ (సీఎస్ఐఆర్)లు సంయుక్తంగా దీనిపై పని చేస్తున్నాయని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. వారం రోజుల్లో ట్రయల్స్ ప్రారంభమవుతాయని చెప్పారు. కరోనా పేషెంట్స్ కు అందిస్తున్న చికిత్సలో అదనంగా వీటిని ఉపయోగిస్తారని తెలిపారు. ఈ మహమ్మారి నుంచి బయటపడేందుకు మన సంప్రదాయ ఔషధాలు కచ్చితంగా తోడ్పడతాయనే నమ్మకం తనకుందని చెప్పారు.