ప్యాకేజీపై ఈ సాయంకాలం మరిన్ని కీలక వివరాలు వెల్లడించనున్న నిర్మలా సీతారామన్
- రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీకి సంబంధించిన వివరాలు తెలుపుతున్న నిర్మల
- నిన్న తొలి మీడియా సమావేశం
- ఈ రోజు మరో రంగంపై ఆర్థిక ప్యాకేజీ వివరాలు
- వ్యవసాయ రంగంపై వివరాలు తెలిపే అవకాశం
కరోనా విపత్తు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీకి సంబంధించిన పలు వివరాలను వెల్లడించడానికి నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మంత్రి మరోసారి మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
ప్యాకేజీ లబ్ధిదారుల వివరాలను కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా ప్రకటిస్తోంది. ఈ క్రమంలో ఈ రోజు సాయంకాలం ఆమె వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్యాకేజీ వివరాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. పదిహేను రకాల ఉద్దీపన పథకాలను ప్రకటించబోతున్నామని నిన్న ఆమె తెలిపిన విషయం తెలిసిందే. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వ గ్యారంటీతో మూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు ఇస్తామని నిన్న ఆమె తెలిపారు.