కావాలనే కరోనాను అంటించుకున్న అమెరికన్ ఖైదీలు... వీడియో ఇదిగో!

  • లాస్ ఏంజిల్స్ కౌంటీ జైల్లో ఘటన
  • 30 మందికి సోకిన కరోనా వైరస్
  • వీడియో విడుదల చేసిన అధికారులు
కరోనా సోకితే జైలు నుంచి బయట పడవచ్చని ప్లాన్ వేసిన కొందరు ఖైదీలు, కావాలనే వ్యాధిని అంటించుకున్న ఘటన అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కౌంటీ జైలులో జరిగింది. ఈ ఖైదీలు చేసిన పని రికార్డయిన సీసీటీవీ ఫుటేజ్ ని జైలు అధికారి అలెక్స్ విల్లా విడుదల చేశారు.

ఈ వీడియోలో, ఒకరు తాగిన నీరు మరొకరు తాగుతూ, ఒకరు ముక్కు చీదిన మాస్క్ ను మరొకరు ధరిస్తూ, ఉద్దేశపూర్వకంగా వైరస్ ను అంటించుకున్నారు. దీంతో రెండు వారాల వ్యవధిలో 30 మంది ఖైదీలకు కరోనా సోకింది. ఇక వీరిని విడుదల చేయని అధికారులు, వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, వీరిపై ఉద్దేశపూర్వకంగా వ్యాధిని వ్యాపించేలా చేసినందుకు కేసులు పెట్టామని తెలిపారు. కాగా, అమెరికాలోని జైళ్లలో ఇప్పటివరకూ 25 వేల మందికి పైగా ఖైదీలకు కరోనా సోకగా, సుమారు 350 మంది వరకూ మరణించారు. 






More Telugu News