గ్యాస్ లీక్ ఘటనపై చర్యలకు ప్రభుత్వం ఎందుకు వెనకాడుతున్నదో అర్థం కావట్లేదు: ఐవైఆర్ కృష్ణారావు
- ఎల్జీ పాలిమర్స్ కంపెనీ విష వాయువు సంఘటనపై స్పందన
- కంపెనీ నేరపూరిత నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్న ఐవైఆర్
- ప్రభుత్వం కనబర్చుతున్న తీరుపై విమర్శలు
విశాఖ సమీపంలోని ఆర్‌ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి గ్యాస్ లీకైన ఘటన విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మండిపడ్డారు.
'ఎల్జీ పాలిమర్స్ కంపెనీ విష వాయువు సంఘటనలో కంపెనీ నేరపూరిత నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. వారిపై తగిన చర్యలు తీసుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెనకాడుతున్నదో అర్థం కావడం లేదు' అంటూ ఐవైఆర్ విమర్శలు గుప్పిస్తూ ట్వీట్లు చేశారు. కాగా, ఆ కంపెనీ నుంచి విషవాయువు లీక్ ప్రభావం ఇప్పటికీ కనపడుతోంది. ఆర్ఆర్ వెంకటాపురం వాసులు కొందరు నిన్న కూడా అస్వస్థతకు గురైనట్టు వార్తలొస్తున్నాయి.