జాతీయ సగటును మించిన ఏపీ కరోనా రికవరీ రేటు!

  • రికవరీల్లో ఏపీ మెరుగైన గణాంకాలు
  • 53.44 శాతానికి పెరిగిన రికవరీ రేటు
  • అత్యద్భుత ఫలితాలు సాధించిన ప్రకాశం జిల్లా
కరోనా కేసులు 2 వేలు దాటినప్పటికీ రికవరీల్లో ఆంధ్రప్రదేశ్ మెరుగైన గణాంకాలను చూపుతోంది. జాతీయ స్థాయిలో రికవరీ సగటు 32.9 శాతం ఉండగా, ఏపీలో మాత్రం 53.44 శాతంగా ఉంది. ఇప్పటివరకూ 2,137 కేసులు నమోదు కాగా, వారిలో 1,142 మంది చికిత్స తరువాత పూర్తిగా కోలుకుని ఇంటికి చేరుకున్నారు. 47 మంది మరణించగా, 948 మంది చికిత్స పొందుతున్నారు.

ఇక రికవరీల్లో ప్రకాశం జిల్లా అత్యద్భుత ఫలితాలను సాధించింది. ఏకంగా 95.23 శాతం రికవరీ రేటును నమోదు చేసింది. ఈ జిల్లాలో 63 కేసులు రాగా, అరవై మంది ఇప్పటికే కోలుకుని ఇంటికి వెళ్లిపోయారు. కేసుల సంఖ్య అత్యధికంగా ఉన్న కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సైతం యాక్టివ్ గా ఉన్న కేసుల కన్నా, డిశ్చార్జ్ అయినవారే అధికమని అధికారులు వెల్లడించారు.


More Telugu News