కరోనా వైరస్ ల్యాబ్‌లోనే పురుడుపోసుకుంది.. గడ్కరీ నోట ట్రంప్ మాట!
- వైరస్‌తో కలిసి జీవించడం నేర్చుకోవాలి
- వైరస్ సహజ సిద్ధంగా పుట్టింది కాదు
- టీకా కోసం ప్రపంచవ్యాప్తంగా కృషి
కరోనా వైరస్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ నోట వినిపించాయి. ఇటీవల ట్రంప్ పలు సందర్భాల్లో మాట్లాడుతూ.. కరోనా వైరస్ సహజ సిద్ధంగా పుట్టింది కాదని, అది వుహాన్ ల్యాబ్‌లో పుట్టిందని ఆరోపించారు.
ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలనే గడ్కరీ కూడా చేశారు. నిన్న ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ సహజ సిద్ధంగా వచ్చింది కాదని, అది ల్యాబ్‌లో పుట్టిందని అన్నారు. ప్రపంచ దేశాలన్నీ ఈ వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు శ్రమిస్తున్నాయన్న గడ్కరీ.. కరోనాతో కలిసి జీవించడం అలవాటు చేసుకోవాలని అన్నారు.