నెల్లూరులో 25 మంది లారీ, ఆటో డ్రైవర్లు క్వారంటైన్ కు తరలింపు!
- చెన్నై కోయంబేడు మార్కెట్లో విస్తరిస్తున్న కరోనా
- అక్కడి నుంచి వస్తున్న వారిలో మహమ్మారి లక్షణాలు
- నెల్లూరు ధనలక్ష్మీపురంలోని క్వారంటైన్ కు డ్రైవర్ల తరలింపు
ఏపీలో కరోనా విస్తరిస్తున్న వేగం కొంచెం తగ్గిందని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో... చెన్నైలోని కోయంబేడు మార్కెట్ కొంప ముంచింది. ఆ మార్కెట్ కారణంగా ఏపీలో మళ్లీ కొత్తగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ మార్కెట్ నుంచి వచ్చిన వారి వల్ల చిత్తూరు, నెల్లూరు, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో కొత్తగా కేసులు నమోదయ్యాయి.
మరోవైపు నెల్లూరు ధనలక్ష్మీపురంలోని ఓ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కు 25 మంది లారీ, ఆటో డ్రైవర్లను పోలీసులు తరలించారు. వీరంతా కోయంబేడు మార్కెట్ నుంచి కూరగాయలను వేసుకొచ్చిన డ్రైవర్లుగా గుర్తించారు. కోయంబేడు మార్కెట్ లో కరోనా పెద్ద ఎత్తున విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి జగన్ కూడా రెండు రోజుల క్రితం స్పందించారు.