సుధీర్ కు, నాకు మధ్య ఓ మంచి బంధం ఉంది ..అంతే!: యాంకర్ రష్మి
- సుధీర్, నేనూ నటీనటులం మాత్రమే
- ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు కష్టపడతాం
- నిజజీవితంలో మేమిద్దరం గొప్ప స్నేహితులం కూడా కాదు
'జబర్దస్త్’ నటుడు ‘సుడిగాలి’ సుధీర్ కు, ప్రముఖ యాంకర్ రష్మికి మధ్య ఏదో ఉందంటూ వదంతులు వ్యాపించడం, వాటిని ఖండించడం రష్మి చేస్తూనే ఉంది. తాజాగా, ఇదే విషయమై ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఆమె మరోమారు స్పందించింది.
సుధీర్ తో తనకు ఉన్న సంబంధం గురించి చెబుతూ, సుధీర్, తానూ నటీనటులం మాత్రమేనని, స్క్రిప్ట్ కి అనుగుణంగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు తామిద్దరం కష్టపడి ఉత్తమమైన ప్రదర్శన కనబరుస్తుంటామని చెప్పింది. నిజజీవితంలో తామిద్దరం గొప్ప స్నేహితులం కూడా కాదని చెప్పిన రష్మిక, తమ మధ్య ఓ మంచి బంధం ఉంది తప్ప అంతకు మించి ఏమీ లేదని స్పష్టం చేసింది.