'డ్రీమ్ గర్ల్' రీమేక్ విషయంలో క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో
- హిందీలో హిట్ కొట్టిన 'డ్రీమ్ గర్ల్'
- తెలుగు రీమేక్ కి సన్నాహాలు
- లాక్ డౌన్ తరువాత సెట్స్ పైకి
క్రితం ఏడాది విజయాన్ని సాధించిన సినిమాల్లో 'డ్రీమ్ గర్ల్' ఒకటి. రాజ్ శాండిల్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయుష్మాన్ కథానాయకుడిగా నటించాడు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 200 కోట్లను వసూలు చేయగా, తెలుగులో రీమేక్ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. రాజ్ తరుణ్ కథానాయకుడిగా సురేశ్ బాబు ఈ సినిమాను నిర్మించనున్నట్టు ప్రకటన వచ్చింది.
ఆ తరువాత కరోనా .. లాక్ డౌన్ ప్రభావం చిత్రపరిశ్రమపై కూడా పడింది. దాంతో ఆర్థికపరమైన ఇబ్బందులవలన సురేశ్ బాబు ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేశాడనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై రాజ్ తరుణ్ స్పందిస్తూ .. 'డ్రీమ్ గర్ల్' సినిమాకి రీమేక్ వుంది. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది. ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనే ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు' అని చెప్పుకొచ్చాడు. కొంతకాలంగా రాజ్ తరుణ్ వరుస పరాజయాలను ఎదుర్కుంటూ వస్తున్నాడు. దాంతో ఆయన ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. కరోనా కష్టాలను దాటుకుని ఈ ప్రాజెక్టు ఎంతవరకూ పట్టాలెక్కుతుందో చూడాలి మరి.