'బిగ్ బాస్ 4'లో యాంకర్ వర్షిణికి చోటు?
- బిగ్ బాస్ 4'కి సన్నాహాలు
- హోస్ట్ గా మరోసారి నాగార్జున
- ఇంతకుముందే పిలుపొచ్చిందన్న వర్షిణి
తెలుగులో 'బిగ్ బాస్' ఇంతవరకూ 3 సీజన్లు పూర్తి చేసుకుంది. 4వ సీజన్ కి సంబంధించిన సన్నాహాలు మొదలైనట్టుగా తెలుస్తోంది. ఈ సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నట్టు సమాచారం. ఇంతకుముందు మాదిరిగానే ఈ సారి కూడా ఒక్కో కేటగిరి నుంచి ఒక్కో సెలబ్రిటీని ఎంపిక చేయనున్నారని అంటున్నారు.
ఈ రియాలిటీ షోలో పోటీదారులుగా ఉండవలసిన సభ్యుల కోసం నిర్వాహకులు ఎంపిక ప్రక్రియను ప్రారంభించారట. వాళ్లు తయారు చేసుకున్న జాబితాలో 'అల్లరి' నరేశ్ .. 'సుడిగాలి' సుధీర్ .. నందూ .. తాగుబోతు రమేశ్ .. ఝాన్సీ .. తదితరుల పేర్లు ఉన్నాయని అంటున్నారు. కొంతమందితో సంప్రదింపులు పూర్తికాగా, మరి కొందరితో చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు.
ఇక తాజాగా ఈ జాబితాలో యాంకర్ వర్షిణి పేరు వినిపిస్తోంది. ఈ విషయంపై వర్షిణి స్పందిస్తూ .. "నిజానికి నేను సీజన్ 2 .. సీజన్ 3 లోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టవలసి వుంది. కానీ అప్పుడు డేట్స్ సర్దుబాటుకాకపోవడం వలన కుదరలేదు. సీజన్ 4 కోసం నన్ను సంప్రదిస్తే మాత్రం తప్పకుండా వెళతాను" అని చెప్పుకొచ్చింది.