‘ఎల్జీ పాలిమర్స్’ నుంచి ‘స్టిరీన్’ తరలింపు ప్రక్రియ ప్రారంభం

  • నిన్న రాత్రి నుంచి ట్యాంకర్ల ద్వారా తరలింపు
  • పోర్టు ప్రాంతంలోని టీ2, టీ3 ట్యాంకులలో స్టిరీన్ 
  • ఈ నెల 17 లోపు ద.కొరియా తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి
విశాఖపట్టణంలో గ్యాస్ లీకేజ్ ఘటనకు కారణమైన ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి స్టిరీన్ రసాయనం తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. నిన్న రాత్రి నుంచి ట్యాంకర్ల ద్వారా ఎమ్ 5,111ఏ, 111 బీ ట్యాంకులలో 3,209 స్టిరీన్ తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. 20 టన్నుల స్టిరీన్ ను రోడ్డు మార్గం ద్వారా పోర్టుకు అధికారులు తరలించారు.

విశాఖ పోర్టు ప్రాంతంలోని టీ2, టీ3 ట్యాంకులలో ఉన్న 9,869 టన్నుల స్టిరీన్ ని వెనక్కి పంపేందుకు పోర్టు అధికారులు, ఆయా కంపెనీల ప్రతినిధులతో కలెక్టర్ మాట్లాడారు. ఆయా ట్యాంకుల నుంచి 7,919 టన్నుల స్టిరీన్ ని వెజల్ అర్హన్ లోకి లోడింగ్ చేశారు. మిగిలిన స్టిరీన్ ను వెజల్ నార్డ్ మేజిక్ ద్వారా ఈ నెల 17 లోపు దక్షిణ కొరియా తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, విశాఖలో మొత్తం 13,048 టన్నుల స్టిరీన్ ను జిల్లా యంత్రాంగం గుర్తించింది.


More Telugu News