ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి జగన్ గారూ!: గ్యాస్ లీక్ దుర్ఘటనపై దేవినేని ఉమ
- ట్రస్టుకు డబ్బులు వెళ్లాయ్.. ఎల్జీకి అనుమతులొచ్చాయ్
- తూతూ మంత్రం కేసులుపెట్టారు
- ఆధారాలు చెరిపేస్తున్నారు
- విశాఖగ్యాస్ చట్టం ఎప్పుడు తీసుకువస్తారు?
విశాఖగ్యాస్ చట్టం ఎప్పుడు తీసుకువస్తారో చెప్పాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రశ్నించారు. 'ట్రస్టుకు డబ్బులు వెళ్లాయ్.. ఎల్జీకి అనుమతులొచ్చాయ్.. తూతూ మంత్రం కేసులుపెట్టారు.. ఆధారాలు చెరిపేస్తున్నారు.. స్టైరిన్/వేపర్ దేశం దాటిపోతుంది. ప్రజలకు ఊపిరందట్లేదు. విశాఖగ్యాస్ చట్టం ఎప్పుడు తీసుకువస్తారో ప్రజలు అడుగుతున్నారు సమాధానం చెప్పండి ఒక్కఛాన్స్ ముఖ్యమంత్రి గారు' అని దేవినేని ఉమ ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా పలు వార్తా పత్రికల్లో వచ్చిన వార్తలను దేవినేని ఉమ పోస్ట్ చేశారు. స్టైరిన్ విషవాయువు ప్రభావం గ్రామాల్లో ఇంకా తగ్గలేదని, నిన్న మరో పది మంది సొమ్మసిల్లి పడిపోయారని, వీరిలో ఇద్దరు వార్డు వాలంటీర్లు, ఇద్దరు ఆశావర్కర్లూ ఉన్నారని ఆ వార్తా పత్రికల్లో ఉంది. కళ్లలో మంటలు, వాంతులతో నానా ఇబ్బందులు పడుతున్నామని ఆర్‌ఆర్ వెంకటాపురం గ్రామస్థులు మీడియాకు తెలిపారు.