కాలినడకన మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ కు.. రోడ్డు పైనే వలస కూలీ ప్రసవం!
- మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ కు కాలినడకన వలస కూలీలు
- ఇందులో ఓ నిండు గర్భిణీ కూడా ఉంది
- కొంత దూరం నడిచాక ప్రసవించిన మహిళ
లాక్ డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు కొంత మంది కాలినడకన తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని మధ్యప్రదేశ్ వలస కూలీలు కూడా తమ స్వస్థలాలకు బయలుదేరారు. ఇందులో ఓ నిండు గర్భిణి కూడా తన భర్తతో కలిసి తమ స్వస్థలమైన సత్నాకు చేరుకునేందుకు కాలినడక ప్రారంభించింది.
నెలలు నిండటంతో మార్గమధ్యంలోనే ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో, రోడ్డు పైనే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. మరో ఆసక్తికర విషయమేమిటంటే, ప్రసవించిన రెండుగంటల తర్వాత తమ బిడ్డతో పాటు భార్యాభర్తలు తిరిగి నడక ప్రారంభించారు. అప్పుడే పుట్టిన బిడ్డతో కలిసి మరో 150 కిలో మీటర్లు నడిచారు. సత్నా సరిహద్దులో వారిని అధికారులు గుర్తించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.