మీరు రాయలసీమ బిడ్డేనా? ఏపీవారేనా?: చంద్రబాబుపై విజయసాయిరెడ్డి విమర్శలు
- శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని పంపించే జీవోపై మీ స్టాండ్ ఏమిటి?
- అడ్డమైన విషయాలపై జూమ్ లో మాట్లాడతారు
- ఈ నెల 5న విడుదలైన జీవోపై మాట్లాడేందుకు మనసు రాలేదా?
శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 టీఎంసీల కృష్ణా నీటిని ఎత్తి కుడి ప్రధాన కాల్వలోకి విడుదల చేయడంతో పాటు పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో రాయలసీమ ప్రాంతానికి నీటిని అధికంగా సరఫరా చేయాలని అనుకుంటోంది.
అలాగే గాలేరు-నగరి, ఎస్సార్బీసీ కాల్వలను కూడా 30 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ నెల 5న జీవో కూడా జారీ చేసింది. దీనిపై తెలంగాణ, ఏపీ మధ్య వివాదం రాజుకున్న విషయంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై విమర్శలు గుప్పించారు.
'చంద్రబాబు గారూ.. శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని పంపించే జీవో 203పై మీ స్టాండ్ ఏమిటి? అడ్డమైన విషయాలపై జూమ్ లో మాట్లాడే మీకు.. ఈ నెల 5న విడుదలైన జీవోపై మాట్లాడేందుకు వారం దాటినా మనసు రాలేదా? మీరు రాయలసీమ బిడ్డేనా..? మీరు ఏపీవారేనా..?' అంటూ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.