లాక్‌డౌన్ నిబంధనలు పాటించలేదని.. బీజేపీ ఎంపీ బండి సంజయ్‌పై కేసు నమోదు
- నాగార్జున సాగర్ నియోజకవర్గంలో సంజయ్ పర్యటన
- బత్తాయి రైతులకు పరామర్శ
- 188 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పెద్దవూర పోలీసులు
బీజేపీ ఎంపీ, ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై నల్గొండ జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్‌డౌన్ నిబంధనల్లో భాగమైన భౌతిక దూరాన్ని పాటించకపోవడంతోనే ఆయనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆయనతోపాటు మరికొందరు నేతలపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు.
బండి సంజయ్ నిన్న నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించారు. జిల్లాలోని పెద్దవూర మండలం ఊట్లపల్లిలో బత్తాయి రైతులను పరామర్శించి వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. బత్తాయి దిగుబడి సరిపడా లేకపోవడంతో పెట్టుబడి కూడా రావడం లేదని అన్నారు. రైతుల వద్ద నుంచి ప్రభుత్వమే బత్తాయిలు కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరారు.
కాగా, ఈ సందర్భంగా భౌతిక దూరం నిబంధనలను గాలికి వదిలేశారని ఆరోపిస్తూ పెద్దవూర పోలీసులు బండి సంజయ్‌తోపాటు పలువురు బీజేపీ నేతలపైనా 188 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు.