చెన్నైలో చెలరేగుతున్న కరోనా.. ముగ్గురు ఐపీఎస్ అధికారులకు సోకిన మహమ్మారి
- తమిళనాడులో వేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్
- చెన్నైలో అత్యధిక కేసులు
- కరోనా బారినపడిన 190 మంది పోలీసులు
కరోనా వైరస్ తమిళనాడు ప్రజలను వణికిస్తోంది. వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత పది రోజుల్లోనే కేసులు మూడింతలయ్యాయి. వీటిలో అత్యధికంగా చెన్నైలోనే వెలుగుచూస్తున్నాయి. ఇక, కోయంబేడు మార్కెట్ ప్రభావం చెంగల్పట్టు, తిరువళ్లూరు, కడలూరు, అరియలూరు జిల్లాల్లో సైతం కనిపిస్తోంది.
చెన్నై తర్వాత అత్యధిక కేసులు వెలుగు చూస్తున్నది ఇక్కడే. ప్రభుత్వం నిన్న విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. చెన్నైలో 4,882, తిరువళ్లూరులో 467, కడలూరులో 396, చెంగల్పట్టులో 391, అరియలూరులో 344, విళుపురంలో 299 కేసులు నమోదయ్యాయి.
మరోవైపు, ఉన్నతాధికారులు కూడా వైరస్ బారినపడుతున్నారు. చెన్నైలో ముగ్గురు ఐపీఎస్ అధికారులు మహమ్మారి వైరస్ బారినపడ్డారు. దీంతో కోవిడ్ బారినపడిన మొత్తం పోలీసుల సంఖ్య 190కి పెరిగింది. అలాగే, చెన్నై స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓ హెల్త్ ఇన్‌స్పెక్టర్ కూడా కరోనా బారినపడ్డారు.