బంగాళాఖాతంలో అల్పపీడనం... భారీ వర్షాలకు అవకాశం!

  • నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం
  • ఇప్పటికే ద్రోణి ప్రభావంతో వర్షాలు
  • మరిన్ని వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ
నేటి సాయంత్రానికి ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది మరింతగా బలపడేందుకు ఉపరితల ద్రోణి కూడా తోడు కానుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం నాడు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఇక అల్పపీడనం కూడా తోడైతే, రాగల రెండు మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. కాగా, నిన్న హైదరాబాద్ లోని పలు ప్రాంతాలతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో, ఉమ్మడి నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి తదితర జిల్లాల పరిధిలో వర్షాలు కురిశాయి.


More Telugu News