టీకా ఆశలపై నీళ్లు చల్లిన బ్రిటన్ ప్రధాని.. ఆందోళనకర వ్యాఖ్యలు
- టీకా వచ్చేందుకు ఏడాది పట్టే అవకాశం ఉంది
- అసలు రాకపోవచ్చు కూడా
- బ్రిటన్‌లో దశల వారీగా లాక్‌డౌన్ తొలగింపు
కరోనా మహమ్మారితో పోరాడుతూ టీకా కోసం ఆశగా ఎదురుచూస్తున్న ప్రపంచానికి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ షాకిచ్చారు. ఆయన చేసిన ప్రకటన మరింత ఆందోళన పెంచేలా ఉంది. కరోనా వైరస్‌కు టీకా వచ్చే అవకాశం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.
కరోనాకు సమర్థవంతమైన టీకా రావాలంటే ఇంకా ఏడాదికిపైగా సమయం పట్టే అవకాశం ఉందన్న జాన్సన్.. అసలెప్పటికీ టీకా రాకపోవచ్చని కూడా పేర్కొన్నారు. మరోవైపు, కరోనాతో దేశం ఆర్థికంగా కుదేలవుతున్న నేపథ్యంలో దశల వారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయాల్సిన అవసరం ఉందని బోరిస్ నొక్కి చెప్పారు.