లైంగిక వేధింపులకు గురైన వారి పేర్లు ఎఫ్ఐఆర్ లో రాయొద్దు: తెలంగాణ హైకోర్టు
- బాధితులు, తల్లిదండ్రుల పేర్లు, గుర్తింపును రాయొద్దు
- బాధితుల పేర్లు సీల్డ్ కవర్లలోనే ఇవ్వాలి
- అన్ని పీఎస్ లకు ఆదేశాలు ఇవ్వాలని డీజీపీకి సూచన
లైంగిక వేధింపులకు గురైన బాధితుల పేర్లను ఎఫ్ఐఆర్ లో రాయొద్దని పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. 'నిపుణ్ సక్సేనా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా' కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం బాధితులు, వారి తల్లిదండ్రుల పేర్లు, గుర్తింపును వెల్లడించరాదని తేల్చి చెప్పింది.
ఒకే కేంద్రీయ విద్యాలయలో ప్రిన్సిపల్ గా పని చేస్తున్న వ్యక్తి అక్కడి విద్యార్థినిని లైంగికంగా వేధించారనే కేసు విషయంలో... దర్యాప్తు అధికారులు ఐఫ్ఐఆర్, ఛార్జ్ షీట్, రిమాండ్ రిపోర్టులో విద్యార్థిని, ఆమె తల్లిదండ్రుల పేర్లను ఉపయోగించడాన్ని హైకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది.
కేసు ట్రయల్ ముగియకముందే తనపై శాఖాపరమైన చర్యలు ఎలా తీసుకుంటారని నిందితుడు వేసిన పిటిషన్ ను హైకోర్టు విచారించింది. కేంద్రీయ విద్యాలయ నిబంధనల ప్రకారం శాఖాపరమైన చర్యలు చేపట్టవచ్చని ఈ సందర్భంగా హైకోర్టు తెలిపింది. క్రిమినల్ కేసు విచారణకు దీనితో సంబంధం లేదని చెప్పింది. బాధితుల పేర్లను సీల్డ్ కవర్ లోనే ఇవ్వాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించేలా అన్ని పోలీస్ స్టేషన్లకు ఆదేశాలను ఇవ్వాలని డీజీపీకి సూచించింది. మీడియా సంస్థలు కూడా ఈ నిబంధనలను పాటించేలా చీఫ్ సెక్రటరీని ఆదేశించింది.