కరోనా కష్టకాలంలో రూ.20 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజి ప్రకటించిన మోదీ
- ఆత్మ నిర్భర్ అభియాన్ పేరిట ప్యాకేజి
- భారత ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చే నిర్ణయం అని వెల్లడి
- భారత్ పురోగతే ప్రపంచ పురోగతిగా మారిందని వ్యాఖ్యలు
గత 4 నెలులుగా కరోనాతో పోరాడుతున్నామని, యావత్ ప్రపంచంతో పాటు భారత్ కూడా శక్తివంచన లేకుండా శ్రమిస్తోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు అంటూ భారీ ప్యాకేజిని ప్రకటించారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరిట రూ.20 లక్షల కోట్లతో ప్యాకేజి ప్రకటించారు. 21వ శతాబ్దం భారత్ దేనని, ఈ ప్యాకేజి అండగా మన దేశం మున్ముందు కూడా మరింత మెరుగైన ఆర్థిక పురోగతి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తాజా ప్యాకేజి భారత్ జీడీపీలో 10 శాతం ఉంటుందని అన్నారు. ఈ మొత్తాన్ని ప్రధానంగా వ్యవసాయం, కార్మికులు, కుటీర పరిశ్రమలు, లఘు పరిశ్రమలపై వెచ్చించనున్నామని, పేదలు, వలస కార్మికులు, కూలీలు, మత్స్యకారులకు ఈ ప్యాకేజి ఊతమిస్తుందని వివరించారు. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రేపు వెల్లడిస్తారని మోదీ పేర్కొన్నారు. విపత్తును కూడా భారత్ అవకాశంగా మల్చుకుంటుందని తెలిపారు. ఇప్పుడు భారత్ పురోగతే ప్రపంచ పురోగతిగా మారిందని వివరించారు.