వెంటిలేటర్లో మంటలు... ఐదుగురు కరోనా పేషెంట్ల దుర్మరణం!
- రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో విషాదం
- సామర్థ్యానికి మించి వెంటిలేటర్లను వినియోగిస్తుండటంతో విషాదం
- 150 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు
రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వెంటిలేటర్ లో మంటలు చెలరేగడంతో... ఐసీయూలో చికిత్స పొందుతున్న ఐదుగురు కరోనా పేషెంట్లు దుర్మరణం చెందారు. నగరంలోని ఓ ఆసుపత్రిలో ఈరోజు ఈ ప్రమాదం సంభవించింది. ఈ విషయాన్ని ఆ దేశ ఎమర్జెన్సీ మంత్రిత్వ శాఖ కూడా ధ్రువీకరించింది. ఘటన సమాచారం అందగానే అక్కడి నుంచి 150 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించామని తెలిపింది.
వెంటిలేటర్లను సామర్థ్యానికి మించి వినియోగిస్తుండటమే ప్రమాదానికి కారణం. వెంటిలేటర్ పై ఒత్తిడి పెరగడంతో... ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో, ఆ వెంటిలేటర్ పై ఆధారపడిన వారంతా ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు రష్యాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2.2 లక్షలు దాటింది.