మహారాష్ట్ర నుంచి ఏపీకి చేరుకున్న 930 మంది వలస కార్మికులు... 38 మందికి కరోనా
- థానే నుంచి కర్నూలు వచ్చిన శ్రామిక్ రైలు
- 250 మందికి కరోనా పరీక్షలు
- కరోనా పాజిటివ్ వ్యక్తులకు క్వారంటైన్
- కార్మికులు క్లస్టర్ కంటైన్మెంట్ పరిధిలోకి రారన్న అధికారులు
లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో వలస కూలీలను రైళ్లలో తరలిస్తున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తిని నివారించేందుకు లాక్ డౌన్ ప్రకటించడంతో అనేక రాష్ట్రాల్లో వలస కార్మికులు చిక్కుకుపోయారు. వారికోసం శ్రామిక్ రైళ్లను నడుపుతున్నారు. తాజాగా శ్రామిక్ రైలులో మహారాష్ట్రలోని థానే నుంచి కర్నూలుకు 930 మంది వలస కార్మికులు రాగా వారిలో 250 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. వారిలో 38 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో వారిని క్వారంటైన్ కు తరలించారు.
అయితే, వీరికి క్లస్టర్ కంటైన్మెంట్ విధానం అమలు చేయాల్సిన పనిలేదని అధికారులు చెబుతున్నారు. కరోనా సోకిన ఆ వలస కార్మికులకు వారి ఆరోగ్య స్థితిని అనుసరించి వైద్యం అందిస్తారని తెలుస్తోంది. కాగా, ఈ వలస కార్మికులందరూ ముంబయిలోని మసీద్ బండారి చేపల మార్కెట్ లో పనిచేసి వచ్చినట్టు గుర్తించారు.