'వెబ్ సిరీస్' కోసం పర్మిషన్ అడిగిన అల్లు అరవింద్?

  • ఓటీటీ ప్లాట్ ఫామ్ 'ఆహా'ను ప్రారంభించిన అల్లు అరవింద్
  • మినీ వెబ్ సిరీస్ నిర్మించాలనుకుంటున్న వైనం
  • యూనిట్ కు పర్మిషన్ ఇవ్వాలని కోరిన అరవింద్
లాక్ డౌన్ కారణంగా సినీ పరిశ్రమ పూర్తిగా స్తంభించిపోయింది. షూటింగులతో పాటు ప్రీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో కనీసం పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసమయినా అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని నిర్మాతలు కోరుతున్నారు. అగ్రనిర్మాత అల్లు అరవింద్ కూడా ప్రభుత్వానికి ప్రత్యేక విన్నపం చేసినట్టు సమాచారం.

ఓటీటీ ప్లాట్ ఫామ్ 'ఆహా'ను అల్లు అరవింద్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని కోసం ఓ మినీ వెబ్ సిరీస్ ను నిర్మించాలనుకుంటున్నారు. దీని కోసం 15 నుంచి 20 మంది సభ్యులున్న యూనిట్ కు అనుమతి ఇవ్వాలని కోరారు. కరోనా ఎఫెక్ట్ లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పినట్టు సమాచారం.


More Telugu News