సిరిసిల్ల మగ్గం మళ్లీ కదిలింది: కేటీఆర్
- చేనేత పని పునఃప్రారంభమైందంటూ కేటీఆర్ ట్వీట్
- సిరిసిల్ల బ్రాండ్ ను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని వెల్లడి
- చేనేత కార్మికుల ప్రతిభ పట్ల గర్విస్తున్నానంటూ వ్యాఖ్యలు
సిరిసిల్ల చేనేత సోదరులు, సోదరీమణుల ప్రతిభ పట్ల తాను ఎంతో గర్విస్తున్నానని తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. సిరిసిల్లలో చేనేత పని పునఃప్రారంభమైందని, బతుకమ్మ చీరలు నేయడం కొనసాగిస్తున్నారని ట్వీట్ చేశారు. సిరిసిల్ల చేనేత ఉత్పత్తులంటే ఓ ఎన్నదగిన బ్రాండ్ గా అభివృద్ధి చేయడమే స్థానిక ఎమ్మెల్యేగా తన లక్ష్యమని కేటీఆర్ వివరించారు. ఈ స్వప్నం సాకారమవ్వాలంటే టెక్స్ టైల్ పార్క్, అప్పెరెల్ పార్క్ ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు.