ఎయిమ్స్ నుంచి మన్మోహన్ సింగ్ డిశ్చార్జ్
- ఛాతీ నొప్పితో ఆదివారం ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన మన్మోహన్
- కరోనా పరీక్ష నిర్వహించగా నెగిటివ్ నిర్ధారణ
- ప్రస్తుతం పూర్తి ఆరోగ్యవంతంగా ఉన్నారన్న వైద్యులు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (87) ఛాతీ నొప్పితో ఆదివారం ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన సంగతి విదితమే. ఆయన కోలుకోవడంతో ఈ రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని ఎయిమ్స్ అధికారులు ప్రకటించారు. డిశ్చార్జ్ అయిన వెంటనే ఆయన ఆసుపత్రి నుంచి తన నివాసానికి వెళ్లారు. ఛాతీ నొప్పితో ఆయన ఆసుపత్రిలో చేరగా జ్వరం కూడా వచ్చింది. ఆయనకు కరోనా పరీక్ష నిర్వహించగా నెగిటివ్ అని తేలింది. ఆయన ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని వైద్యులు చెప్పారు.
మొదట ఆయనకు కార్డియాక్ ఐసీయూలో చికిత్స అందించామని, అనంతరం ఆసుపత్రిలోని మరో గదికి తరలించి చికిత్స అందించామని వైద్యులు తెలిపారు. కాగా, 2009లో ఆయనకు బైపాస్ సర్జరీ కూడా జరిగింది. 1990లోనూ ఆయనకు యూకేలో బైపాస్ సర్జరీ జరిగింది.