'జగదేక వీరుడు..' సినిమాకి చిరు, శ్రీదేవి తీసుకున్న పారితోషికం
- చిరూ పారితోషికం 35 లక్షలు
- శ్రీదేవి అందుకున్న మొత్తం 25 లక్షలు
- ప్రధాన ఆకర్షణగా ఇళయరాజా సంగీతం
చిరంజీవి - శ్రీదేవి జంటగా నటించిన 'జగదేకవీరుడు అతిలోక సుందరి' సినిమా, 1990లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమా, తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిలా నిలిచిపోయింది. ఈ సినిమా 30 ఏళ్లను పూర్తిచేసుకున్న సందర్భంగా, అందుకు సంబంధించిన వార్తలు కొన్ని రోజులుగా షికారు చేస్తున్నాయి.
ఈ సినిమా కోసం చిరంజీవి - శ్రీదేవి ఎంత పారితోషికం తీసుకుని ఉంటారనేది అభిమానుల్లో కుతూహలాన్ని రేకెత్తిస్తోంది. చిరంజీవి 35 లక్షలను పారితోషికంగా తీసుకుంటే .. తన పారితోషికంగా 25 లక్షలను శ్రీదేవి అందుకున్నారనేది తాజా సమాచారం. బాల్కనీ టికెట్ 6 రూపాయలకి మాత్రమే అమ్మిన ఆ రోజుల్లో, ఈ సినిమా 7 కోట్ల షేర్ ను రాబట్టడం విశేషంగా చెబుతారు. ఈ సినిమా తరువాత చిరంజీవి పారితోషికం ఒక రేంజ్ లో పెరిగిందని అంటారు. కథాకథనాలు .. చిరంజీవి యాక్షన్ .. శ్రీదేవి గ్లామర్ .. ఇళయరాజా సంగీతం .. ఫొటోగ్రఫీ ఈ సినిమా ఇప్పటికీ గుర్తుండిపోవడానికి ప్రధాన కారణాలుగా చెబుతారు.